పెబ్బేరు మున్సిపాలిటీ సమీపంలోని ఈద్గ (తాతయ్య దర్గా) వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించి, నేడు పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు “రంజాన్ మాసం అందరికీ ఆయురారోగ్యాలను, శాంతిని, సమృద్ధిని అందించాలని” ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకట్ రాములు, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, సాగర్, రంజిత్ కుమార్, రాములు యాదవ్, వినయ్, జగదీశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, నరసింహ, ఆశన్న, సునీల్ కుమార్, నరేందర్, శివ, సాయి, అంజి, డైరెక్టర్ రాములు, రణధీర్ రెడ్డి, మోతి రాములు తదితరులు పాల్గొన్నారు.
