
పెబ్బేరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వేగం పెంచింది. తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు, పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు వి.దిలీప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు పట్టణంలోని 2వ వార్డులోని ఎద్దుల సాయి ఇంటి వద్ద నుండి ఇంటింటి ప్రచారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పట్టణంలో ఒక్క వార్డులోనైనా అభివృద్ధి జరగలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే ప్రస్తుతం సీసీ రోడ్లు వేశారు అని విమర్శించారు.
ఇంతేగాక, ఇందిరమ్మ ఇండ్లను అర్హులకన్నా అనర్హులకు కేటాయించారని, వృద్ధులకు రూ.4000, వికలాంగులకు రూ.6000 పెన్షన్లు, నిరుద్యోగులకు భృతి, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి కింద రూ.1.5 లక్షల సాయం, తులం బంగారం వంటి హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.
ఈ కారణంగా ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణ శ్రీ, మాజీ వైస్ చైర్మన్ మేకల కర్ర స్వామి, కౌన్సిలర్లు చిన్న ఎల్లారెడ్డి, గోపి బాబు, రామకృష్ణ, సోప్పరి బీచ్ పల్లి శంకర్ నాయుడు, రమేష్ గౌడ్, సాయి రెడ్డి, సహదేవుడు, సంతోష్, వి.సాయి రెడ్డి, యాదగిరి గౌడ్, వేణు, మన్యం గోనెల సహదేవుడు, సంబురాము, వసంత్, గోవర్ధన్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు రాములు, సీకే రాము, నరేష్, నాగిరెడ్డి, రమేష్, శేఖర్ ఆచారి, రమేష్ భారతి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
