సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా వాసి మురళీ నాయక్ దేశరక్షణలో ప్రాణత్యాగం
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ నుండి జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారు. భారత్ భద్రతా బలగాల్లో విధులు నిర్వర్తిస్తున్న మురళీ నాయక్ శత్రు కాల్పుల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు.
వీర జవాన్ మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. ఆయన మృతి వార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించగా, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీ నాయక్ ఇంటి వద్ద తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
వీర జవాన్ మురళీ నాయక్ పార్థివదేహం రేపు స్వగ్రామమైన కల్లితండాకు చేరుకోనుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆయన వీర మరణంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలియజేశారు.
జై జవాన్ – జై హింద్
