
పత్తి కొనుగోలు సన్నాహాలపై కలెక్టర్ సమీక్ష
కరీంనగర్ : పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 44,885 ఎకరాల్లో పత్తి సాగి, 5 లక్షల 38 వేల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిన్నింగ్ మిల్లులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
