జమ్మికుంటలో 1.90 లక్షల రూపాయల నగదు దొంగతనం

జమ్మికుంట, ఆగస్టు 21 (జిందగీ 9న్యూస్) :
జమ్మికుంట పట్టణంలో దొంగలు కరెన్సీ దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం – పెద్దంపల్లి గ్రామానికి చెందిన పొద్దుటూరి శ్యామ్‌రెడ్డి గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో జమ్మికుంటలోని ఎస్బిఐ బ్యాంక్‌కు వెళ్లి తన ఖాతా నుండి రూ.1,90,000 నగదు డ్రా చేసుకున్నాడు. ఆ మొత్తాన్ని తన ద్విచక్ర వాహనం (AP15 6644) ముందు జిప్‌లో పెట్టి, తన భార్యను బస్టాండులో బస్సు ఎక్కించి తిరిగి పాత మార్కెట్ వద్ద ఉన్న నందిని కిరాణా దుకాణం వద్దకు చేరుకున్నాడు.
అక్కడ కొన్ని సామాన్లు తీసుకోవడానికి దుకాణంలోకి వెళ్లి, పక్క దుకాణంలో కూడా కొన్నాడు. తిరిగి వచ్చి బండి ముందు జిప్‌లో డబ్బులు పరిశీలించగా నగదు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు 1.90 లక్షల నగదు దొంగిలించినట్లు ఫిర్యాదులో తెలిపారు.
ఈ మేరకు శ్యామ్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
