సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచరణ్ (35) బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి రూ.12 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. సాయిచరణ్ చికిత్స కోసం కుటుంబం ఇంటిని విక్రయించాల్సి వచ్చింది. విషయం తెలియగానే సీఎం వెంటనే స్పందించి, రూ.5 లక్షలతో పాటు CMRF ద్వారా అదనంగా రూ.7 లక్షల్ని అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తైంది. కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన సాయిచరణ్, కృతజ్ఞతలు తెలిపారు. సీఎం భుజం తట్టి ధైర్యం చెప్పారు.
