హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ప్రమాద భీమా చెక్కుల పంపిణీ
హుజురాబాద్: ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చుతూ, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి రూ. 4 లక్షల విలువ గల ప్రమాద భీమా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “పార్టీ కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు. వారి సేవలకు గుర్తింపుగా, అకాల మరణాలవల్ల వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించేందుకు ఈ సహాయాన్ని అందిస్తున్నాం” అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొని తమ కృతజ్ఞతలు తెలిపారు.
