
జూలూరుపాడు, జూన్ 15 (జిందగి9న్యూస్) : గిరిజన హక్కుల సాధనకై రాష్ట్రస్థాయి ఉద్యమ కార్యాచరణ సమావేశానికి ఖమ్మం జిల్లా తరఫున వెళ్లిన లంబాడా నాయకులు కీలక డిమాండ్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు 7.5% నుండి 14%కు పెంచాలని, అలాగే 10 శాతం రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సాధారణ సెలవుగా ప్రకటించాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో భద్రాది కొత్తగూడెం జిల్లా లంబాడాకుల పోరాట సమితి నాయకులు నంగారా బేరి, పంతులు నాయక్, భూక్య లాలు నాయక్, లకావత్ నాగేశ్వరరావు నాయక్, బాబు, పాపా నాయక్, వృద్ధి నాయక్, సాయి నాయక్, అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఉద్యమం గిరిజన హక్కులకు న్యాయం జరిగే దిశగా ప్రభుత్వాన్ని స్పందింపజేస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
