
ఎస్.ఆర్లో ‘సాట్ క్యూ 2026’ ప్రతిభా పరీక్ష విజయవంతం
హనుమకొండ: పదో తరగతి విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడం, వారికి ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఎస్.ఆర్ విద్యాసంస్థలు ‘సాట్ క్యూ 2026’ ప్రతిభా పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి.
ఎస్.ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి ఆదేశాల మేరకు, సీఈవో సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో, వరంగల్ జోనల్ ఇంచార్జి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పరీక్ష టీచర్స్ కాలనీలోని ఎస్.ఆర్ ఎడ్యూ సెంటర్లో జరిగింది.
అడ్మిషన్ హెడ్ రాధాకృష్ణ, జోనల్ ఇంచార్జి శ్రీరామ్, అకాడమిక్ డీన్స్ మహేశ్వర్ రెడ్డి, బి.ఎన్.రెడ్డి, ఎస్.ఆర్ ఎడ్యు సెంటర్ ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, ఫోకస్ ప్రిన్సిపాల్ అనిల్, సీనియర్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది సారధ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, వందశాతం ఉపకార వేతనాలు అందించడంతో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్లలో ప్రవేశం పొందే అవకాశం కల్పించబడనుంది.
వరంగల్, హనుమకొండ పరిధిలోని పలు పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
