
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (65) ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. జూన్ 5న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాగంటి మృతి వార్త తెలిసిన వెంటనే మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గోపినాథ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని మాదాపూర్లోని నివాసానికి తరలించగా, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
