
జమ్మికుంట, జూన్ 7 (zindagi9news ) : ఈ నెల 14న హుజురాబాద్లో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ జరుగనుంది. ఇందులో ఇష్టం పూర్వకంగా రాజీపడే కేసులను పరిష్కరించుకోవాలని ఫిర్యాది, ముద్దాయిలకు జమ్మికుంట టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ సూచించారు. చిన్నచిన్న వివాదాలు జీవితాన్ని నాశనం చేయకుండా, ఒకే గ్రామం, కుటుంబానికి చెందినవారు చట్టబద్ధంగా రాజీ దారిని ఎంచుకుని శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
