
కరీంనగర్, జూన్ 7 (zindagi9news): సర్కారీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా 6 వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. డ్రాప్ఔట్లను తగ్గించేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.
