అక్రమ ఇసుక నిల్వలపై సీజ్ చర్య
75 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్న అధికారులు
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారులో, కృష్ణా నది సమీపంలో అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 75 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ చర్యలు చేపట్టారు.
కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
