దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు: TGPSC
హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షలపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఖండించింది. కొందరు దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనివెనుక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల హస్తం ఉన్నట్లు కమిషన్ ఆరోపించింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సాధారణ విషయమని, నిపుణుల సమీక్షతో ప్రోటోకాల్ ప్రకారమే వాల్యుయేషన్ జరగిందని స్పష్టం చేసింది.
అలాగే ఎస్టీ కేటగిరీలో టాపర్ అయిన అభ్యర్థిపై జరుగుతున్న దుష్ప్రచారం కూడా అప్రామాణికమని పేర్కొంది. మహిళల సౌలభ్యం కోసం కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 25 శాతం మహిళా అభ్యర్థులు అక్కడే పరీక్ష రాశారని, మెజారిటీ మహిళలు అదే సెంటర్ నుంచి ఎంపికయ్యారని వివరించింది.
