ఒలంపియాడ్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ప్రతిభకు గుర్తింపు..
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మాస్టర్ మైండ్స్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను చాటారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అభ్యాస్ అకాడమీ నిర్వహించిన రామన్ సైన్స్ మహోత్సవ్, రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్, బోస్ మెడికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఠాగూర్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్షలలో పలువురు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు.
విజేత విద్యార్థులను DRDO డైరెక్టర్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి , IAS అధికారిక జనార్దన్ రెడ్డి సత్కరించి, మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లావణ్య, రంగారెడ్డిలకు “బెస్ట్ ఒలంపియాడ్ స్కూల్ ఆఫ్ ది ఇయర్” అవార్డుతో ఘన సన్మానం నిర్వహించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థులను అభినందించారు.
