
ఇల్లంతకుంటలో విషాద ఘటన… గడ్డి మందు తాగి వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మాజీపల్లి గ్రామానికి చెందిన వేమా రాజు (36) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది.మృతుని తల్లి వేమా విమల తెలిపిన వివరాల ప్రకారం, గత కొద్దిరోజులుగా మద్యానికి బానిసైన వేమా రాజు, భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తీవ్ర దిగులు, మనస్థాపానికి గురయ్యాడు. ఈ మనోవేదనతో ఈ నెల 2న గడ్డి మందు తాగినట్లు తెలిపారు.అస్వస్థతకు గురైన వేమా రాజును కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై మృతుని తల్లి వేమా విమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట పోలీసులు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
