
అదనపు కట్నం వేధింపులు భరించలేక 7 నెలల గర్భిణి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికురాలు మల్లెబోయానా మౌనిక(20) అదనపు కట్నం వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2024 డిసెంబర్ 22న భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన మల్లెబోయిన ప్రశాంత్(26) ను మౌనిక వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో వధువు కుటుంబం 2 గుంటల ఇంటి భూమి విలువ రూ.8 లక్షలు, 2¼ తులాల బంగారం, ఇతర వరకట్న సామగ్రి అందజేశారు.
అయితే వివాహానంతరం భర్త ప్రశాంత్, అత్తమామలు సంపత్–నరసమ్మ అదనంగా మోటార్‌సైకిల్ కోసం కట్నం వేధింపులకు పాల్పడ్డారని మృతురాలి తల్లి మంత్రి ఉమా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులను భరించలేక ఏడు నెలల గర్భిణి అయిన మౌనిక నవంబర్ 17, 2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
