
అకాల వర్షం – అపార నష్టం
పెట్టుబడులు తీరవని రైతులు ఆవేదన
జిందగీ 9న్యూస్, సెప్టెంబర్ 30 (వైరా నియోజకవర్గ రిపోర్టర్: రాము) : ఏనుకూరు మండలంలోని రేపల్లెవాడ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షం రైతులకు కష్టాలు మిగిల్చింది. పొలాలు వాగులను తలపించేలా మారడంతో విత్తనాలు, ఎరువులు వేసిన పంటలు మొత్తం నీట మునిగిపోయాయి.
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు.
వర్షాల కారణంగా అపార నష్టం జరిగిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
