
జమ్మికుంట పట్టణం ఆబాది జమ్మికుంటలో ఆదివారం బీరప్ప బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కురుమ, గొల్ల కులస్తులు డప్పు సప్పులతో బీరప్ప దేవాలయానికి బోనాలు అర్పించి నైవేద్యం సమర్పించారు. చలోజి చేతుల మీదుగా మొక్కులు తీర్చుతూ గొర్రె పొడేళ్ళను బలి ఇచ్చారు. ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ బీరప్పను కులదైవంగా పూజించి, వర్షాలు సకాలంలో కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. మహిళలు, చిన్నారులతో కలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
