అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ను,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని AITUC జాతీయ పిలుపుమేరకు నల్లబ్యాడ్జీలతో డోన్ పట్టణంలోని RDO కార్యాలయంలో నందు AITUC నియోజవర్గ కార్యదర్శి అబ్బాస్ అధ్యక్షతన ధర్నా నిర్వహించి అనంతరం RDO కి వినతి పత్రం సమర్పించడం జరిగింది….
ఈ సందర్భంగా AITUC డోన్ నియోజవర్గ అధ్యక్ష కార్యదర్శులు పుల్లయ్య, అబ్బాస్, అంగన్వాడి జిల్లా కార్యదర్శి జులేఖ, జిల్లా ట్రెజరర్ ఎస్తేరమ్మ వారు మాట్లాడుతూ ఎన్నికల కన్నా ముందు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడి వర్కర్స్ లక్ష మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చి 42 రోజులుగా సమ్మె నిర్వహించడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అంగన్వాడి వర్కర్లను వేతనాలు పెంచకుండా సమ్మె చేసినందుకు పోలీసులతో బెదిరించి కేసులు పెట్టి పోలీసులు పెట్టి నిర్బంధించి అనేక ఇబ్బందులకు గురిచేసి ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు ఆ సందర్భంలో ఎన్నికల బహిరంగ సభలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను అధికారంలోకి వస్తే అంగన్వాడి వర్కర్స్ కు వేతనాలు పెంచడంతోపాటు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు కానీ నేడు అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటిన సంబంధిత మంత్రులను రాష్ట్ర స్థాయి అధికారులను కలిసి విన్నవించిన అంగన్వాడి వర్కర్ల సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో చూస్తున్నాం ,హామీలు ఇచ్చి అంగన్వాడి వర్కర్ల వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేయడం చాలా అన్యాయమని వారు అగ్రహించారు,చాలీచాలని వేతనంతో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం అలాగే కరెంటు చార్జీలు పెంచడం వలన తమ కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకము ప్రజల దగ్గర చేరాలో అన్ని చేస్తున్న విపరీతంగా పని ప్రారంభించి అనేక యాప్లు పెట్టి 8గంటల పరిమిధానాన్ని తుంగలో తొక్కారని వారన్నారు. తెలంగాణలో మాదిరి 18 వేల వేతనం పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని విదులలో మరణిస్తే తగిన ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మట్టి ఖర్చులకు 20 వేల రూపాయలు అందించాలని అంగన్వాడి వర్కర్లు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వీటితో పాటు అనేక సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు,ఆశా మధ్యాహ్న భోజనం వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి,పెరిగిన ధరలు కనుగుణంగా ఆశా మధ్యాహ్నం భోజనం వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇచ్చి పని భారం తగ్గించాలని ఆశ వర్కర్లను సచివాలయాలకు సంబంధం లేకుండా వైద్యరంగం ద్వారా విధులు నిర్వహించుటకు ఆదేశాలు ఇవ్వాలన్నారు ఆశ వర్కర్లు అనేక యాపులు పెట్టి 24 గంటలు పని చేస్తున్నారు అని పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు అర్హత గల ఆశ వర్కర్లను ఏఎన్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు
మధ్యాహ్న భోజన వర్కర్లకు పదివేల రూపాయల వేతనం ఇచ్చి మెస్ చార్జీలు పెంచాలని వంటగదులు నిర్మించి ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని పని భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ డోన్ నియోజకవర్గ కార్యదర్శి స్వర్ణలత, జయలక్ష్మి,సుగుణ, విజయలక్ష్మి, ధనలక్ష్మి, నాగేంద్రమ్మ, రమణమ్మ, నిర్మల, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు…

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
