విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై విశాఖలో జోనల్ సదస్సు

విశాఖపట్నం, ఆగస్టు 21 (జిందగీ9న్యూస్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను సంస్థల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నంలో జోనల్ సదస్సు నిర్వహించారు. విశాఖ జోన్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు సదస్సుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా కార్మికులకు న్యాయం చేయాలని, కాంట్రాక్ట్ వ్యవస్థకు ముగింపు పలకాలని, విద్యుత్ సంస్థల్లో కార్మికులను విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వేలాది మంది కార్మికుల ఐక్యతతో జరిగిన ఈ సదస్సు తమ సమస్యల పరిష్కారం కోసం మరింత బలమైన పోరాటానికి నాంది పలికిందని నిర్వాహకులు తెలిపారు.
