సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని సీతారామచంద్ర ఆలయంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఉపవాసకులు వేద పండితులు ఆమంచి అనంతరామశాస్త్రి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తర ముఖ ద్వారం తో దర్శనం తో పాటు మరియు అభిషేక కార్యక్రమాలు అష్టోత్తరాలు తదుపరి కార్యక్రమాలు జరుగును కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వైకుంఠ ఏకాదశి వేడుకలను విజయవంతం చేయాలని వారు అన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని మండల ప్రజలను కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సభ్యులు శంబయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
