అనారోగ్యం భరించలేక యువతి ఆత్మహత్య

జమ్మికుంట: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన చిట్యాల ప్రణతి (24) హన్మకొండలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గత మూడేళ్లుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు గమనించి తలుపులు తీసి చూసేసరికి ప్రణతి మృతి చెంది ఉంది. మృతురాలి తల్లి విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
