
వైరా, మార్చి 25: ఖమ్మం జిల్లా వైరాలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. రవాణా వాహనాలపై జరిమానాలు విధించకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) ప్రసాద్, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
వైరా ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్, తన పరిధిలోని ఒక ఫిర్యాదుదారుడికి చెందిన రవాణా వాహనాలపై పెనాల్టీలు విధించకుండా ఉండేందుకు తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజశేఖర్ ద్వారా రూ. 24,800/- లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, పథకం ప్రకారం వైరాలోని ఆర్టీఓ యూనిట్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు.
లంచం సొమ్ము తీసుకుంటుండగా ఎంవీఐ ప్రసాద్‌ను మరియు అతని అసిస్టెంట్ రాజశేఖర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.
