
ఎన్నికల హామీని నెరవేర్చిన వార్డు సభ్యురాలు వైష్ణవి నరేష్
టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యురాలు బొంగోని వైష్ణవి నరేష్ గౌడ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. 6వ వార్డుకు చెందిన చిట్యాల రవళి–శ్రీధర్ దంపతుల కుమార్తె తేజ అమృత నూతన వస్త్రాల కార్యక్రమానికి హాజరై రూ.2516 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా వైష్ణవి నరేష్ మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్ల పాటు వార్డులో జరిగే ప్రతి కార్యక్రమంలో ముందుండి సేవలందిస్తానన్నారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వ్యాసనవేణి శ్రీలేఖ సతీష్ రావు, ఉప సర్పంచ్ శాస్త్రాల సమ్మయ్య, వార్డు సభ్యులు అంబుల కుమారస్వామి, బోల్లికొండ రాజన్న, కొడారి సుజాత రాజు, కన్నూరి సదయ్య, వాసాల నీల రవి, చిట్యాల ప్రమీల, పెద్ద పోశాలు తదితరులు పాల్గొన్నారు.
