ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వెలిచాల రాజేందర్రావు ఘన స్వాగతం
కరీంనగర్, సెప్టెంబర్ 30: కరీంనగర్ నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి బుధవారం కరీంనగర్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ఘన స్వాగతం పలికారు.
నూతన కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజేందర్రావు పూల మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజేందర్రావును ఆప్యాయంగా పలకరించి కొద్దిసేపు మాట్లాడారు.
అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాజేందర్రావు పాల్గొన్నారు. కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన పూజా కార్యక్రమం, సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలను రాజేందర్రావు వీక్షించారు.
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
Z9ZINDAGI9NEWS
ZINDAGI9NEWS
Zindagi9News • Epaper Clip