రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

జమ్మికుంట, జూలై 13 (జిందగి9న్యూస్): బిజిగిరిషరీఫ్–జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 60–65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు.మృతుడు లేత గులాబీ (పింక్) రంగు టీ-షర్ట్, నలుపు రంగు నెక్కర్ (తెలుపు గీతల డిజైన్తో) ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ఇతర గుర్తింపు వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9949304574 లేదా 8712658604 నంబర్లకు సమాచారం అందించాలని జీఆర్పీ అధికారులు కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
