
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. పెబ్బేరు పట్టణంలో విషాదం
పెబ్బేరు, మే 16(Zindagi9News): పెబ్బేరు మున్సిపాలిటీ పరిధికి చెందిన ఇద్దరు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, పెబ్బేరు పట్టణానికి చెందిన బోయ రాజశేఖర్, మహేష్ ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
మృతుడు రాజశేఖర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, మహేష్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబాలకు ఆధారమైన ఇద్దరు వ్యక్తులు ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే పెబ్బేరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, బంధువులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
