జమ్మికుంట లో విషాదం.. కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్య

జమ్మికుంట, జూలై 15 (Zindagi9news): జమ్మికుంట పట్టణంలోని ధర్మారం రైల్వే పట్టాల వద్ద మంగళవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కేబుల్ ఆపరేటర్ దాసరి రామ్మూర్తి గౌడ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
