అద్దంకి దయాకర్, డా. వెంకట్ నర్సింగ్‌రావు బాల్మూర్కు రాష్ట్ర మంత్రి హోదా

హైదరాబాద్, జూలై 14 (జిందగి9న్యూస్): తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ విప్‌లుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, డా. వెంకట్ నర్సింగ్‌రావు బాల్మూర్కు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రి (Minister of State) హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ జీఓ ఆర్.టి. నెం.570ను జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, మార్చి 18, 2026 నుంచి ప్రభుత్వ విప్‌లుగా విధులు నిర్వహిస్తున్న అద్దంకి దయాకర్, డా. వెంకట్ నర్సింగ్‌రావు బాల్మూర్లకు అదే తేదీ నుంచి రాష్ట్ర మంత్రి హోదా వర్తించనుంది. ఈ హోదా వారు ప్రభుత్వ విప్‌లుగా కొనసాగినంత కాలం మాత్రమే అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం సంబంధిత ప్రోటోకాల్, మర్యాదలను కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
