
తిప్పాయపల్లి, వనపర్తి జిల్లా : తిప్పాయపల్లి గ్రామంలో నిర్వహించిన Tpl-5 తిప్పాయపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ప్రథమ బహుమతిని నేషనల్ హెల్త్ కోఆర్డినేటర్, వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు డాక్టర్ జిల్లేల ఆదిత్యా రెడ్డి అందజేశారు. ద్వితీయ బహుమతిని మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి. శ్రీనివాస్ రెడ్డి ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎం. రాజేష్, కొండారెడ్డి దాతలుగా సహకారం అందించారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ సాగర్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అనిల్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎల్లస్వామి నాయుడు, నవీన్ గౌడ్, రాజు, మహేష్, కార్తీక్, ఆంజనేయులు, నిరంజన్, నర్సింహా వంటి యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
