రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్

హైదరాబాద్, ఆగస్టు 18 (Zindagi9news): భవన నిర్మాణ అనుమతి ఫైల్ ప్రాసెస్ చేసి, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమీన్స్మెంట్ లెటర్ ఇచ్చేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఏసీబీకి చిక్కారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. హైదరాబాద్ చార్మినార్ జోన్, సంతోష్‌నగర్ సర్కిల్-25లో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న సి హెచ్. ప్రభావతి ఫిర్యాదుదారుడి నుంచి రూ.20,000 లంచం డిమాండ్ చేశారు. భవన నిర్మాణ అనుమతి ఫైల్ ప్రాసెస్ చేయడంతో పాటు బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమీన్స్మెంట్ లెటర్ అందించేందుకు ఈ మొత్తాన్ని అడిగినట్లు ఏసీబీ తెలిపింది.
మంగళవారం ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ప్రభావతి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆమె వద్ద నుంచి రూ.20 వేల లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితురాలిని నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉంది.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
