టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
జూలై 6న జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్

హైదరాబాద్, జూలై 3(Zindagi9news): తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఘం (TGSWREIS) 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జూలై 6న జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి (ఎఫ్ఏసీ) వెల్లడించారు.
ఇప్పటికే ఆర్జేసీసీఈటీ-2026 ద్వారా రెండు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిందని, ఇంకా కొన్ని సీట్లు ఖాళీగా ఉండటంతో వాటి భర్తీ కోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు తమ జిల్లా కేంద్రంలో నిర్వహించే కౌన్సెలింగ్కు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
