టీజీపీఎస్సీ ద్వారా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, జూలై 11 (జిందగి9న్యూస్): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (నం. 06/GTP/2026, తేదీ: 10-07-2026) విడుదల చేసింది. మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో స్టేట్ లెవల్లో 2 పోస్టులు, మల్టీ జోనల్ స్థాయిలో 5 పోస్టులు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు 2026 జూలై 15 నుంచి ఆగస్టు 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 44 సంవత్సరాలు (01-07-2026 నాటికి)గా నిర్ణయించారు. ఎంపికైన వారికి రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు వేతనం అందుతుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (B.Planning) లేదా బీటెక్ (Planning) అర్హత కలిగి ఉండాలి. పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, రిజర్వేషన్లు, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కమిషన్ సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
