
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రిక్రూట్మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.
పరీక్షల వివరాలు:
- అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–II), తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు – అక్టోబర్ 24, 2026
- అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు – అక్టోబర్ 26, 2026
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్), రోడ్లు–భవనాల శాఖ – నవంబర్ 6, 7 తేదీల్లో
- డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్–I, పాఠశాల విద్యాశాఖ – నవంబర్ 12, 13 తేదీల్లో
- పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.
అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన తదుపరి వివరాలు, హాల్‌టికెట్ల సమాచారం కోసం టీజీపీఎస్సీ అధికారిక ప్రకటనలను పరిశీలించాలని కమిషన్ సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
