రూ.4,850 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం

గోదావరిఖని, అక్టోబర్ 18 (జిందగీ 9 న్యూస్): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్ఐ దీకొండ రమేష్, సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,850 నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో మహమ్మద్ తాజుద్దీన్ (లక్ష్మీనగర్), బండారి సందీప్ సుధాకర్, లింగంపల్లి శివ, నెరెల్ల రాజు, కీర్తి హరీష్ (సప్తగిరి కాలనీ) ఉన్నారు. అనంతరం ఐదుగురు వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
