
జన్నారం, అక్టోబర్ 18 (జిందగీ 9 న్యూస్): రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులో పేకాట స్థావరంపై శనివారం నార్కోటిక్ టీమ్/టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్ఐ దీకొండ రమేష్, లచ్చన్న, ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది దాడి చేపట్టారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.42,040 నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఎనుగుల శేఖర్, గారెపల్లి సాగర్ గౌడ్, శ్రీరాముల రాజేశం, జక్కుల తిరుపతి, తక్కళ్లపల్లి శ్రీనివాస్, నేరెళ్ల రాజు, ఎల్. సుధాకర్, గోత్రాల రమేష్ ఉన్నారు. వీరిలో కొందరు కలమడుగు గ్రామానికి చెందినవారు కాగా, మరికొందరు రేవోజిపేట గ్రామానికి చెందినవారిగా పోలీసులు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందితో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం జన్నారం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
