గంగాధరలో జూద స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి.. ఆరుగురు అరెస్ట్
రూ.52,380 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం
అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయి: కరీంనగర్ పోలీసులు

కరీంనగర్, జూలై 24 (Zindagi9News): కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఎల్లమ్మ తొవ్వ ప్రాంతంలో నిర్వహిస్తున్న అక్రమ జూద స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.నిందితుల వద్ద నుంచి రూ.52,380 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కరీంనగర్ పోలీసులు జీరో టాలరెన్స్ విధానంతో కఠిన చర్యలు కొనసాగిస్తారని పోలీసు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
