BSNLలో 100 జనరల్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.2.25 లక్షల జీతం

న్యూఢిల్లీ, జూలై 24 (Zindagi9News): భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన జనరల్ మేనేజర్ (టెలికాం స్ట్రీమ్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూలై 21, 2026 నుంచి ప్రారంభమై ఆగస్టు 5, 2026 ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు B.E./B.Tech (ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయి ఉండాలి. MBA చేసిన అభ్యర్థులకు అదనపు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు. సంబంధిత రంగంలో 15 సంవత్సరాల అనుభవం, అందులో కనీసం 5 సంవత్సరాలు సీనియర్ మేనేజీరియల్ స్థాయిలో పనిచేసిన అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియలో తొలి దశలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, అనంతరం గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో నెలకు రూ.2,25,000 వేతనం చెల్లిస్తారు. మొదట ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించి, పనితీరు ఆధారంగా గరిష్టంగా ఐదేళ్ల వరకు కాంట్రాక్ట్‌ను పొడిగించే అవకాశం ఉందని BSNL నోటిఫికేషన్లో పేర్కొంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.

pulluriraviteja20@gmail.com