పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పాటు మరిన్ని కఠిన చర్యలు నేడు!
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద కేసుల వేగవంత విచారణకు ఢిల్లీలో ప్రత్యేక కోర్టు
విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యం: ప్రధాని నరేంద్ర మోదీ
కేంద్ర కేబినెట్లో పేపర్ లీక్‌లపై మరిన్ని కఠిన నిర్ణయాలకు అవకాశం

న్యూఢిల్లీ, జూలై 24 (Zindagi9News): దేశవ్యాప్తంగా పేపర్ లీక్ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వరుసగా కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–2024 కింద నమోదయ్యే కేసుల వేగవంత విచారణ కోసం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సముదాయంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తిగా అను గ్రోవర్ బలీగాను నియమించారు.
ఇదే సమయంలో, పేపర్ లీక్‌లపై మరింత కఠిన చర్యలను నేడు జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రకటిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
పేపర్ లీక్‌లకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు, దర్యాప్తు వేగవంతం, కేసుల త్వరితగతిన విచారణ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పటిష్ఠమైన వ్యవస్థను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం పేర్కొంది.
