CBSE ‘OSM’పై సుప్రీంకోర్టులో విచారణ.. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని సూచన
స్కానింగ్ లోపాలు, పోర్టల్ సమస్యలు, మూల్యాంకనంలో అవకతవకలపై పిటిషన్..
ప్రభావిత విద్యార్థులకు రక్షణ కల్పించే మార్గాలు చూడాలని CBSEకి ఆదేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (Zindagi9News): CBSE 2026లో తొలిసారిగా ప్రవేశపెట్టిన On-Screen Marking (OSM) డిజిటల్ మూల్యాంకన విధానంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
OSM విధానంలో సమాధాన పత్రాల పేజీలు సరిగా స్కాన్ కాకపోవడం, కొన్ని పేజీలు కనిపించకపోవడం, స్కాన్లు స్పష్టంగా లేకపోవడం, మూల్యాంకనం జరగకపోవడం వంటి సమస్యలు తలెత్తాయని పిటిషన్లో ఆరోపించారు. ఈ లోపాల కారణంగా కొందరు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చి, ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించినప్పటికీ కొన్ని కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన కనీస మార్కులను పొందలేకపోయారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ పరిస్థితిపై స్పందించిన సుప్రీంకోర్టు.. OSM మూల్యాంకన సమస్యలతో ప్రభావితమైన విద్యార్థుల ప్రయోజనాలను ఎలా కాపాడవచ్చో పరిశీలించాలని CBSEని కోరింది. ముఖ్యంగా ప్రవేశ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన లేదా పూర్తయిన సందర్భాల్లో విద్యార్థులకు నష్టం జరగకుండా తీసుకోగల చర్యలను పరిశీలించాలని సూచించింది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.
CBSE మాత్రం OSM విధానాన్ని 2026 నుంచి క్లాస్-12 సమాధాన పత్రాల మూల్యాంకనానికి ప్రవేశపెట్టింది. డిజిటల్ విధానం ద్వారా మూల్యాంకనంలో పారదర్శకత, వేగం పెంచడంతో పాటు టోటలింగ్ లోపాలను తగ్గించడమే లక్ష్యమని అప్పట్లో పేర్కొంది.
అయితే CBSE ఇప్పటికే స్కాన్ చేసిన సమాధాన పత్రాల్లో Missing Pages, Missing Supplementary Sheets, Blurred Pages, తప్పు Answer Book, వేరే Set Marking Schemeతో మూల్యాంకనం వంటి సమస్యలపై విద్యార్థులకు Verification, Re-evaluation సదుపాయాలను కల్పించింది.
ఈ వ్యవహారం నేపథ్యంలో OSM మూల్యాంకనంలో ఎదురైన సమస్యలపై సుప్రీంకోర్టు విచారణ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
