5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
త్వరలో టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్

హైదరాబాద్, జూలై 3(Zindagi9news): తెలంగాణలో పోలీసు శాఖలో 5,000 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జూన్ 27న జీవో ఎంఎస్ నెం.78 జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
జీవో ప్రకారం మొత్తం 5,000 పోస్టుల్లో సివిల్ ఎస్ఐలు 148, ఏఆర్ ఎస్ఐలు 14, టీజీఎస్పీ రిజర్వ్ ఎస్ఐలు 12, ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు 3, ఏఎస్ఐ (ఎఫ్‌పీబీ) 23 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ 3,697, ఏఆర్ 1,052, ఎస్ఏఆర్ సీపీఎల్ 24, డ్రైవర్ 20, మెకానిక్ 7 పోస్టులు భర్తీ చేయనున్నారు.
స్థానిక కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్, అర్హతలు తదితర వివరాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు పంపించి, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం సంబంధిత శాఖలను ఆదేశించింది.
