గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏసీబీ వలలో
రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన నరసింహులు

హైదరాబాద్, జూన్ 23(Zindagi9news): హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వి. నరసింహులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. విధి నిర్వహణలో భాగంగా స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు భవిష్యత్తులో వేధించబోమంటూ ఫిర్యాదుదారుడి నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన ఆయన, అందులో భాగంగా రూ.50 వేల నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.50 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా లబ్ధి పొందేందుకు విధులను దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఎస్ఐ నరసింహులును అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
