ఆస్ట్రేలియాలో బర్డ్ ఫ్లూ కలకలం..
H5N1 వైరస్ కేసుతో అప్రమత్తమైన అధికారులు

క్యాన్బెర్రా, జూన్ 24(Zindagi9news): ఆస్ట్రేలియాలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. పశ్చిమ ఆస్ట్రేలియాలో H5N1 వైరస్ కేసులు నమోదైన అనంతరం తాజాగా సౌత్ ఆస్ట్రేలియాలోనూ వలస పక్షుల్లో ఈ వైరస్ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పక్షుల నమూనాల సేకరణ, పరీక్షలను ముమ్మరం చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా పక్షుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా పలు ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
