పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. ఆగస్టు 9 వరకు దరఖాస్తులు

న్యూఢిల్లీ, జూలై 23 (Zindagi9news): ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ జూలై 20 నుంచి ప్రారంభమై, ఆగస్టు 9, 2026 వరకు కొనసాగనుంది. అవసరమైతే ఆన్లైన్ పరీక్షను ఆగస్టు లేదా సెప్టెంబర్ 2026లో నిర్వహించనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టగా, తెలంగాణకు 41 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌కు 4 పోస్టులు కేటాయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.
ఎంపికైన అభ్యర్థులకు JMGS-I స్కేల్ కింద రూ.48,480–85,920 వేతన శ్రేణి వర్తిస్తుంది. ప్రాథమిక వేతనంతో పాటు డీఏ, సీసీఏ, హెచ్ఆర్ఏ/లీజ్డ్ వసతి, లీవ్ ఫేర్ కన్సెషన్, మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సౌకర్యాలు బ్యాంకు నిబంధనల ప్రకారం అందించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు పీఎన్బీ అధికారిక వెబ్సైట్ (https://pnb.bank.in/Recruitments.aspx)లో అందుబాటులో ఉన్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
