‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు

హైదరాబాద్, జూలై 23 (Zindagi9News): ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో నడుస్తున్న కార్యకలాపాలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అవమానించే ఉద్దేశంతో అమెరికాలోని బోస్టన్లో ఉన్న ఓ వ్యక్తి ఈ పేరును ప్రారంభించాడని ఆయన ఆరోపించారు.
శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లలో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు జరిగిన పరిణామాల తరహాలోనే భారత్లో కూడా అల్లర్లు, అస్థిరత సృష్టించడమే ఈ సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని విభజించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న ఖలిస్తానీ అనుకూల శక్తులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేతులు కలపడం అత్యంత సిగ్గుచేటని ఆరోపించారు.
విదేశీ, దేశద్రోహ శక్తుల కుట్రల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
