కూకట్‌పల్లిలో రెండు OYO హోటళ్లపై పోలీసుల తనిఖీలు

హైదరాబాద్, ఆగస్టు 21: కూకట్పల్లి పోలీసులు ఈ నెల 18న అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లోని రెండు OYO హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 12 మందిని గుర్తించగా, 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 7 స్మార్ట్ఫోన్లు, 6 కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.హోటల్ యజమాని పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హోటళ్లలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
