ఈటల రాజేందర్‌ను కలిసిన పెబ్బేరు నాయకులు

హైదరాబాద్: మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ను పెబ్బేరు ప్రాంతానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షుడు కాంతల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన కొహెడ భూముల అంశంతో పాటు, దేశంలోనే అతిపెద్ద సంతలలో ఒకటిగా గుర్తింపు పొందిన పెబ్బేరు సంత అభివృద్ధిపై చర్చించారు.
అనంతరం నాయకులు నారెడ్డి దిలీప్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సామాల విశ్వశాంత్ రెడ్డి, నందిమల్ల సత్యనారాయణ రెడ్డి, గూడూరు శివారాం రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రాంతీయ అభివృద్ధి, ప్రజా సమస్యలు, మార్కెట్‌కు సంబంధించిన అంశాలపై నాయకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
