పెబ్బేరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 10 నుంచి 15 మందికి గాయాలు

వనపర్తి జిల్లాలోని పెబ్బేరు వెళ్లే జాతీయ రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో సుమారు 10 నుంచి 15 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు వనపర్తి డిపోకు చెందిన TS31 Z0015 నంబర్ బస్సుగా గుర్తించినట్లు సమాచారం.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
