ఎస్ఎస్సీలో 341 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) శుభవార్త తెలిపింది. Assistant Section Officer (ASO)/Assistant Grade Limited Departmental Competitive Examination–2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 341 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS)-318, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)-23 పోస్టులు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు జూన్ 25, 2026 నుంచి జూలై 16, 2026 రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆగస్టు 2026లో ఢిల్లీ-ఎన్సీఆర్లో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-7 ప్రకారం రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు వేతనం లభించనుంది.
పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు విధానం మరియు ఆన్లైన్ అప్లికేషన్ కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎస్ఎస్సీ సూచించింది.
వెబ్సైట్లు:
SSC అధికారిక వెబ్సైట్: https://ssc.gov.in
ఆన్లైన్ దరఖాస్తు: https://ssc.gov.in/login
